search on

Sunday, October 23, 2016

Mahesh babu back step ..for .. bhubali2. Conclusion....Mahesh cinema out of the race ....















సూపర్ స్టార్ మహేష్ బాబు వెనక్కి తగ్గారు. కమర్షియల్ డైరక్టర్ మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, నమ్రత సంయుక్తంగా ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం శ్రమిస్తోంది. ఏప్రిల్ 28 న విడుదల చేయాలని  ప్రిన్స్ మొదట భావించారు.
ఆరోజు విడుదలైన పోకిరి సూపర్ హిట్ కావడంతో ఎలాగైనా ఆరోజు సినిమా రిలీజ్ చేయాలని అనుకుకున్నారు. కానీ అదే రోజు బాహుబలి 2 వస్తుందని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయితే  ఫస్ట్ డే కలక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తుందని అర్ధం చేసుకొని, తన సినిమాను బాహుబలి కంక్లూజన్ కంటే రెండు వారాలు ముందు రిలీజ్ చేయాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 14న  సూపర్ స్టార్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

No comments:

Post a Comment